కెప్టెన్సీ వివాదం.. గంగూలీ, కోహ్లీకి సునీల్ గవాస్కర్ కీలక సూచన

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియాలో కెప్టెన్సీ వివాదం రచ్చగా మారింది. బీసీసీఐ, కోహ్లీ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. బీసీసీఐ చీఫ్ ఒకటి చెబుతుంటే.. కింగ్ కోహ్లీ మరో విధంగా చెబుతుండటం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ వివాదంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఈ నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ.. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ చెప్పిన దానికి.. విరాట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు పొంతన లేదని అన్నాడు. టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్సీపై […]

Update: 2021-12-16 01:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియాలో కెప్టెన్సీ వివాదం రచ్చగా మారింది. బీసీసీఐ, కోహ్లీ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. బీసీసీఐ చీఫ్ ఒకటి చెబుతుంటే.. కింగ్ కోహ్లీ మరో విధంగా చెబుతుండటం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ వివాదంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు.

ఈ నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ.. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ చెప్పిన దానికి.. విరాట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు పొంతన లేదని అన్నాడు. టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్సీపై వస్తున్న వార్తలపై క్లారిటీ రావాలంటే.. వారిద్దరూ కలిసి మీడియా ముందుకు రావాలని సూచించాడు. ఈ క్రమంలోనే కెప్టెన్‌గా కోహ్లీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో సెలెక్షన్‌ కమిటీ వివరించాలని కోరాడు. అప్పుడే ఈ వివాదానికి తెరపడుతుందని సన్నీ క్లారిటీ ఇచ్చాడు.

Tags:    

Similar News