ఆదివారం ఆరోగ్యకేంద్రానికి సెలవా ?

దిశ మహాముత్తారం: మండలకేంద్రం లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆదివారం తెరువకపోవడంతో అక్కడికి వచ్చిన రోగులు ఆదివారం ఆరోగ్యకేంద్రానికి సెలవు కావచ్చని వెనుదిరిగారు. ఆసుపత్రిలో నిత్యం అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది ఎవరూ లేకపోవడం, అసలే ఆదివారం కావడంతో ఉన్నతాధికారులు ఇటువైపు వచ్చే అవకాశం లేకపోవడంతో ఏకంగా ఆసుపత్రి ని మూసివేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆసుపత్రి లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. […]

Update: 2021-10-17 02:28 GMT

దిశ మహాముత్తారం: మండలకేంద్రం లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆదివారం తెరువకపోవడంతో అక్కడికి వచ్చిన రోగులు ఆదివారం ఆరోగ్యకేంద్రానికి సెలవు కావచ్చని వెనుదిరిగారు. ఆసుపత్రిలో నిత్యం అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది ఎవరూ లేకపోవడం, అసలే ఆదివారం కావడంతో ఉన్నతాధికారులు ఇటువైపు వచ్చే అవకాశం లేకపోవడంతో ఏకంగా ఆసుపత్రి ని మూసివేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆసుపత్రి లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.

కానీ మహాముత్తారం ఆరోగ్యకేంద్రంలో మాత్రం అలాంటి నిబంధనలు మాత్రం పట్టించుకోవడం లేదు. అసలే మారుమూల మండలం 24 గ్రామపంచాయతీ లకు ఉన్న ఒకే ఒక్క ఆరోగ్యకేంద్రం అనుకోకుండా ఏదైనా అపదోస్తే ఆసుపత్రి వైపు చూస్తారు. అలాంటప్పుడు ఆస్పత్రి మూసివుంటే రోగుల పరిస్థితి అగమ్యగోచరమే. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆసుపత్రి మూసివేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. అలాగే నిత్యం పేద ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విదంగా ఆరోగ్య కేంద్రం సమయపాలన ప్రకారం తెరిచి ఉండేలా చూడాలని కోరారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..