‘భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యం’
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సుమారు రూ. 13వేల కోట్ల కుంభకోణంలో నిందితుడు, వజ్రాలవ్యాపారి నీరవ్ మోడీ తనను భారత్‌కు అప్పగించవద్దని లండన్ కోర్టును కోరారు. ఇండియాకు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమవుతుందని కొత్తగా చేసిన అప్పీల్‌లో పేర్కొన్నారు. నీరవ్ మోడీ ఎనిమిదేళ్ల వయసులో ఆమె తల్లి మరణించారని, అప్పటి నుంచి ఆయన మానసిక ఆరోగ్య దెబ్బతిన్నదని, ఆత్మహత్య చేసుకునే లక్షణాలు వెంటాడుతున్నాయని నీరవ్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒకవేళ నీరవ్‌ను భారత్‌కు అప్పగిస్తే సిబ్బంది కొరత, ఖైదీల […]
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సుమారు రూ. 13వేల కోట్ల కుంభకోణంలో నిందితుడు, వజ్రాలవ్యాపారి నీరవ్ మోడీ తనను భారత్‌కు అప్పగించవద్దని లండన్ కోర్టును కోరారు. ఇండియాకు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమవుతుందని కొత్తగా చేసిన అప్పీల్‌లో పేర్కొన్నారు. నీరవ్ మోడీ ఎనిమిదేళ్ల వయసులో ఆమె తల్లి మరణించారని, అప్పటి నుంచి ఆయన మానసిక ఆరోగ్య దెబ్బతిన్నదని, ఆత్మహత్య చేసుకునే లక్షణాలు వెంటాడుతున్నాయని నీరవ్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఒకవేళ నీరవ్‌ను భారత్‌కు అప్పగిస్తే సిబ్బంది కొరత, ఖైదీల రద్దీ అధికంగా ఉండే అక్కడి జైళ్లలో సకాలంలో సైకియాట్రిస్టు కౌన్సెలింగ్ సాధ్యపడదని వివరించారు. భారత్‌కు తరలిస్తే వెంటనే ఆత్మహత్య చేసుకునే ముప్పు ఉన్నదని, లేదా తీవ్ర మనోవేదనకు గురై గాయపరుచుకునే అవకాశమూ ఉన్నదని పేర్కొన్నారు. ఈ కారణాలతో నీరవ్‌ను భారత్‌కు అప్పగించవద్దని కోర్టును కోరారు.