సుహాసిని కొడుకు సూచనలు

కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు… చైన్ సిస్టమ్ బ్రేక్ చేసేందుకు గాను భారత ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తద్వారా Covid 19 అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు కూడా. అయితే విదేశాల నుంచి వచ్చిన వారు మాత్రం సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం లేదని… ఇంట్లో ఉండకుండా కరోనా వ్యాప్తికి […]

Update: 2020-03-22 02:27 GMT

కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు… చైన్ సిస్టమ్ బ్రేక్ చేసేందుకు గాను భారత ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తద్వారా Covid 19 అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు కూడా. అయితే విదేశాల నుంచి వచ్చిన వారు మాత్రం సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం లేదని… ఇంట్లో ఉండకుండా కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారని… అందుకే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని తెలుస్తోంది. అయితే అంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించకూడదు అని చెబుతున్నారు సుహాసిని మణిరత్నం, కుమారుడు నందన్ మణిరత్నంలు. విదేశాల నుంచి వచ్చాక తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో తెలిపాడు. లండన్ నుంచి తిరిగొచ్చిన నుంచి ఒక గదిలో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపాడు నందన్. ఎలా శుభ్రంగా ఉంటున్నాడు…? ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాడు? అనే దానిపై వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా… నందన్ ను అభినందిస్తున్నారు నెటిజన్లు. ఇది చాలా మందికి స్ఫూర్తినిచ్చే వీడియో అవుతుందని ప్రశంసిస్తున్నారు.


Tags: Suhasini Maniratnam, Nandan Maniratnam, Corona Virus, Covid19

Tags:    

Similar News