జగన్‌తో సుబ్బరామిరెడ్డి భేటీ

వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను సీఎం క్యాంపు ఆఫీసులో కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి కలిశారు. వచ్చేనెలతో సుబ్బరామిరెడ్డితో పాటు మరో ముగ్గురు ఏపీ నేతల రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలను పార్లమెంటుకు పంపేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జగన్‌తో సుబ్బరామిరెడ్డి భేటీ ఆసక్తి రేపుతోంది. రాజ్యసభకు వైఎస్సార్సీపీ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డిలను […]

Update: 2020-03-09 04:21 GMT

వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను సీఎం క్యాంపు ఆఫీసులో కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి కలిశారు. వచ్చేనెలతో సుబ్బరామిరెడ్డితో పాటు మరో ముగ్గురు ఏపీ నేతల రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలను పార్లమెంటుకు పంపేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలో జగన్‌తో సుబ్బరామిరెడ్డి భేటీ ఆసక్తి రేపుతోంది. రాజ్యసభకు వైఎస్సార్సీపీ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డిలను పంపేందుకు జగన్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి నలుగురు రాజ్యసభకు పంపనున్న నేపథ్యంలో నాలుగో వ్యక్తిగా టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి లేదా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ సత్వానీకి ఇవ్వనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే సుబ్బరామిరెడ్డి భేటీ కావడం రాజ్యసభ సీటు కోసమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన గత ఢిల్లీ పర్యటన సందర్భంగా బీజేపీ నుంచి ఒకరికి సీటు కేటాయించాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభకు ఎవరిని పంపనున్నారన్న ఆసక్తి రేపుతోంది.

Tags: subbarami reddy, jagan, rajya sabha, cm camp office, vijayawada

 

Tags:    

Similar News