విద్యార్థినులే వంట మనుషులు
కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థినులు వంట మనుషులుగా మారారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల బాలికల గురుకుల కళాశాలలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఏపీ ప్రభుత్వం గత ఏడాదిగా వంట చేసే సిబ్బందికి వేతనాలు చెల్లించక పోవడంతో మూడ్రోజులుగా వారు విధులకు హాజరుకావడం లేదు. దీంతో కళాశాల సిబ్బంది, విద్యార్థినులు వంట చేయాల్సి వస్తోందని కళాశాల ప్రిన్సిపాల్ అంజుమన్ పిరదౌస్ తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం […]
కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థినులు వంట మనుషులుగా మారారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల బాలికల గురుకుల కళాశాలలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఏపీ ప్రభుత్వం గత ఏడాదిగా వంట చేసే సిబ్బందికి వేతనాలు చెల్లించక పోవడంతో మూడ్రోజులుగా వారు విధులకు హాజరుకావడం లేదు. దీంతో కళాశాల సిబ్బంది, విద్యార్థినులు వంట చేయాల్సి వస్తోందని కళాశాల ప్రిన్సిపాల్ అంజుమన్ పిరదౌస్ తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Tags: students prepared food, kurnool, principal anjuman piradas, ap govt, no salary