తల్లిదండ్రులకు హెచ్చరిక.. ఆన్‌లైన్ క్లాసులతో మెల్ల కన్ను ప్రాబ్లమ్!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా పాఠశాలలు మూతబడటంతో గతేడాది నుంచి తరగతులు ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి సాయంత్రం వరకు డిజిటల్ విధానంలో ( మొబైల్, టాబ్స్)లలో క్లాసులు జరుగుతుండటం వలన అదే పనిగా గ్యాడ్జెట్స్ వైపు చూడటంతో పిల్లల్లో దృష్టి లోపంతో పాటు మెల్లకన్ను సమస్య ఏర్పడే ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. తాజా అధ్యయనం ప్రకారం.. రోజులో సగటున 5గంటలు ఆన్ లైన్ క్లాసులు, ఇతర యాక్టివిటీస్ […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా పాఠశాలలు మూతబడటంతో గతేడాది నుంచి తరగతులు ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి సాయంత్రం వరకు డిజిటల్ విధానంలో ( మొబైల్, టాబ్స్)లలో క్లాసులు జరుగుతుండటం వలన అదే పనిగా గ్యాడ్జెట్స్ వైపు చూడటంతో పిల్లల్లో దృష్టి లోపంతో పాటు మెల్లకన్ను సమస్య ఏర్పడే ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.
తాజా అధ్యయనం ప్రకారం.. రోజులో సగటున 5గంటలు ఆన్ లైన్ క్లాసులు, ఇతర యాక్టివిటీస్ కోసం మరో 3గంటలు.. మొత్తంగా 8 గంటలు డిజిటల్ స్క్రీన్ లపై క్లాసులు వింటున్నారని తేలింది. రోజువారీగా ఇదే ప్రక్రియ కొనసాగుతుండటం వలన పిల్లల్లో కంటి పొర దెబ్బతినడంతో పాటు దృష్టిలోపం, మెల్లకన్ను వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తల్లిదండ్రులూ ఆన్‌లైన్ క్లాసుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, తరగతుల అనంతరం కూడా విద్యార్థులు మొబైల్స్, గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉంచాలని సూచించారు. తినే ఆహారంలో పోషకవిలువలు అధికంగా ఉండే వాటిని పిల్లలకు అందించాలన్నారు. దీనివలన దృష్టిలోపాన్ని కొంతమేర అయిన అరికట్టవచ్చునని తెలిపారు.