చీపురు చేతబట్టి పాఠశాల శుభ్రం చేస్తోన్న భావితరం స్వీపర్లు

దిశ, మఠంపల్లి: ‘‘నేటి బాలలే.. రేపటి భావిభారత పౌరులు’’ అని అందరికీ తెలిసిన మాట. కానీ, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తరగతి గదిలో పాఠాలు వినాల్సిన బాల్యం.. పొరక చేతబట్టి పాఠశాల ప్రాంగణాన్ని క్లీన్ చేస్తోంది. పాలకుల నిర్లక్ష్యమో.. అధికారుల అలసత్వమో.. గానీ పుస్తకాలు పట్టాల్సిన చేతితో పొరక(చీపురు) పట్టి పాఠశాలను ఊడ్చడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. మఠంపల్లి మండలంలోని దోనబండతండాలో మండల పరిషత్ ప్రాథమిక […]

Update: 2021-12-04 09:13 GMT

దిశ, మఠంపల్లి: ‘‘నేటి బాలలే.. రేపటి భావిభారత పౌరులు’’ అని అందరికీ తెలిసిన మాట. కానీ, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తరగతి గదిలో పాఠాలు వినాల్సిన బాల్యం.. పొరక చేతబట్టి పాఠశాల ప్రాంగణాన్ని క్లీన్ చేస్తోంది. పాలకుల నిర్లక్ష్యమో.. అధికారుల అలసత్వమో.. గానీ పుస్తకాలు పట్టాల్సిన చేతితో పొరక(చీపురు) పట్టి పాఠశాలను ఊడ్చడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. మఠంపల్లి మండలంలోని దోనబండతండాలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థులు చీపురు చేతబట్టి శనివారం ఉదయం పాఠశాల గేటు ఎదుట చెత్తను శుభ్రం చేస్తున్నారు. ప్రతిరోజూ విద్యార్థులతోనే ఇలా శుభ్రం చేయిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. బాలకార్మికుల నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రత్యేక పోగ్రామ్‌లు, ఏకంగా పాఠశాలలోనే ప్రత్యేక క్లాసులు చెప్పే ఉపాధ్యాయులు చీపురు చేతికిచ్చి పాఠశాలను శుభ్రం చేయించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News