ఓయూలో ఉద్రిక్తత.. విద్యార్థులు అరెస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ ప్రోగ్రాం నేపథ్యంలో ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తి కోసం అకడమిక్ పేరుతో సెమినార్ పెడుతున్నారని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల ఆరోపించారు. పీహెచ్డీ నోటిఫికేషన్ వేయాలని గవర్నర్కు వినతిపత్రం అందజేసేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ దయాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులు, కేసులతో యూనివర్సిటీల వాతావరణాన్ని కలుషితం చేయడంపై విద్యార్థి సంఘాలు […]
దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ ప్రోగ్రాం నేపథ్యంలో ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తి కోసం అకడమిక్ పేరుతో సెమినార్ పెడుతున్నారని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల ఆరోపించారు. పీహెచ్డీ నోటిఫికేషన్ వేయాలని గవర్నర్కు వినతిపత్రం అందజేసేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ దయాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టులు, కేసులతో యూనివర్సిటీల వాతావరణాన్ని కలుషితం చేయడంపై విద్యార్థి సంఘాలు నాయకులు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో మ్యాథ్స్, లైబ్రరీ సైన్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్స్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానంపై సెమినార్ జరుగుతోంది. సెమినార్ కు ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.