ప్రధాని మోడీ ఇలాకలో వింత విడాకులు
దిశ, వెబ్‌డెస్క్ : సైన్స్ ఎంతో అభివృద్ధి చెందినా.. కొంతమంది ఉన్నత విద్యావంతుల్లో మార్పు రావడం లేదు. చదువుకోని ఉద్యోగాలు చేస్తున్నా.. సమాజంపై కనీస అవగాహన ఉండడం లేదు. ఇందుకు ఉదాహారణ వింత విడాకుల ఘటనే. పెళ్లి రోజు భార్యకు నెలసరి వచ్చిందనే కారణంతో విడాకులు కావాలని కోర్టుకెక్కాడో ఘనమైన భర్త. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుజరాత్‌లోని వడోదరకు చెందిన వ్యక్తికి ఈ ఏడాది జనవరిలో వివాహం అయింది. భార్య టీచర్ గా పని […]
దిశ, వెబ్‌డెస్క్ : సైన్స్ ఎంతో అభివృద్ధి చెందినా.. కొంతమంది ఉన్నత విద్యావంతుల్లో మార్పు రావడం లేదు. చదువుకోని ఉద్యోగాలు చేస్తున్నా.. సమాజంపై కనీస అవగాహన ఉండడం లేదు. ఇందుకు ఉదాహారణ వింత విడాకుల ఘటనే. పెళ్లి రోజు భార్యకు నెలసరి వచ్చిందనే కారణంతో విడాకులు కావాలని కోర్టుకెక్కాడో ఘనమైన భర్త. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
గుజరాత్‌లోని వడోదరకు చెందిన వ్యక్తికి ఈ ఏడాది జనవరిలో వివాహం అయింది. భార్య టీచర్ గా పని చేస్తోంది. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ‘పెళ్లి జరిగే రోజు తాను నెలసరిలో ఉన్నానంటూ ఆమె చెప్పడంతో నాతోపాటు మా అమ్మ షాక్ అయ్యామని.. ఈ ఘటన తమ విశ్వాసాన్ని దెబ్బతీసిందని విడాకుల పిటిషన్ లో పేర్కొన్నారు. వివాహం జరిగిన తర్వాత పూజ కోసం ఆలయంలోకి వెళ్లడానికి కొద్ది క్షణాల ముందు తన భార్య ఆమె పరిస్థితి గురించి చెప్పిందని అతడు వివరించాడు. ఇదేకాక వివాహం జరిగిన నాటి నుంచి అస్తమానం ఆమె తనతో ఏదో ఒక విషయంలో గొడవపడి.. పుట్టింటికి వెళ్లిపోతుందని అతడు తన పిటిషన్‌లో ఆరోపించాడు. అతడి వాదన ఎలా ఉన్నా.. నెలసరిని సాకుగా చూపి విడాకులు కోరడం పట్ల మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.