"ఫ్రూట్ ట్రీట్" అదిరిందయ్యా భరద్వాజ్

దిశ, వెబ్ డెస్క్ : చిప్స్ అంటే అందరికీ ఇష్టమే కానీ తినాలంటే భయం అయితే ఇప్పుడు భయం లేకుండా హెల్దీగా చిప్స్ తినేయొచ్చు అంటున్నాడు భరద్వాజ్. ‘ఫ్రూట్ ట్రీట్’ పేరుతో అనేక రకాల చిప్స్ అందిస్తున్న భరద్వాజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నూనె షుగర్ వంటివి లేకుండా పండ్లు కూరగాయలతో రకరకాల రుచులలో చిప్స్ అందిస్తున్నాడు భరద్వాజ్. కర్ణాటక లోని చిక్ మగళూర్ జిల్లాలోని శృంగేరికి చెందిన భరద్వాజ్ ఆ ప్రాంతంలోనే పీజీ వరకు చదివి కొంత కాలం ఓ కాలేజీలో […]

Update: 2020-10-25 05:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : చిప్స్ అంటే అందరికీ ఇష్టమే కానీ తినాలంటే భయం అయితే ఇప్పుడు భయం లేకుండా హెల్దీగా చిప్స్ తినేయొచ్చు అంటున్నాడు భరద్వాజ్. ‘ఫ్రూట్ ట్రీట్’ పేరుతో అనేక రకాల చిప్స్ అందిస్తున్న భరద్వాజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నూనె షుగర్ వంటివి లేకుండా పండ్లు కూరగాయలతో రకరకాల రుచులలో చిప్స్ అందిస్తున్నాడు భరద్వాజ్. కర్ణాటక లోని చిక్ మగళూర్ జిల్లాలోని శృంగేరికి చెందిన భరద్వాజ్ ఆ ప్రాంతంలోనే పీజీ వరకు చదివి కొంత కాలం ఓ కాలేజీలో లెక్చెరర్ గా పని చేశాడు. అయితే రైతు కుటుంబం నుంచి వచ్చిన భరద్వాజ్… రైతులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను గుర్తించాడు.

బొప్పాయి, అరటి, పనస, మామిడి, వంటి వాటితో పాటు కూరగాయలు కూడా బాగా పండే ఆ ప్రాంతానికి మార్కెట్ దూరంగా ఉండటంతో పంటల్ని దళారులకే అమ్మేస్తున్నారు రైతులు. దాంతో గిట్టుబాటు కాని రైతులకు న్యాయం చేయాలని నిర్ణయించుకుని నాలుగేళ్ల క్రితం ‘కరంత్స్ ఫుడ్స్’ ప్రారంభించి ‘ఫ్రూట్ ట్రీట్’ పేరుతో చిప్స్ అందిస్తున్నాడు. నూనెల అవసరం లేకుండా చిప్స్ తయారు చేయడానికి వియత్నాం నుంచి యంత్రాలను తెప్పించాడు.

అరటి, పనస, సపోటా, బొప్పాయి, మామిడి, చిలగడదుంపలు, బెండ, వెల్లుల్లి తదితరాలను రైతుల నుంచి కొని వాటితో చిప్స్ తయారు చేస్తున్నాడు. కృత్రిమ రంగులు, నిల్వ పదార్థాలు కలపకుండా సహజ రుచిని కోల్పోకుండా చూస్తున్నాడు. ఈ చిప్స్ కేఫ్ కాఫీడే, విమానాశ్రయాల్లోని అవుట్ లెట్స్ తోపాటు ఈ కామర్స్ సైట్ బిగ్ బాస్కెట్ లో అందుబాటులో ఉంచారు. అంతే కాదు, బెంగుళూరులోని దాదాపు వంద ఐటీ సంస్థల ఉద్యోగులకు ప్రతిరోజూ చిప్స్ అందిస్తున్నాడు. అలానే దుబాయ్, అబు దాబి, ఇస్తాంబుల్ వంటి చోట్లకు వాటిని ఎగుమతి చేస్తున్నాడు.

Tags:    

Similar News