మంత్రుల వాహనాలపై రాళ్ల దాడి

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్దమైన ఘటనపై ఉజ్జయిని అఘోర సంస్థాన్ ఉప ప్రముఖ్ రాజేష్‌నాథ్‌జీ అఖోరీ, హిందూ మహాసభ, భజరంగ్ దళ్ నాయకులు ఆందోళనకు దిగారు. ఇదే క్రమంలో అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు వచ్చిన మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, విశ్వరూప్, వేణుగోపాల్ వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు అడ్డుకొని మంత్రులను గుడిలోకి తీసుకెళ్లి తలుపులు వేశారు. అనంతరం ఆయా సంఘాల ప్రతినిధులతో మంత్రులు చర్చలు జరపారు. ఘటనకు కారణమైన […]

Update: 2020-09-08 10:12 GMT

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్దమైన ఘటనపై ఉజ్జయిని అఘోర సంస్థాన్ ఉప ప్రముఖ్ రాజేష్‌నాథ్‌జీ అఖోరీ, హిందూ మహాసభ, భజరంగ్ దళ్ నాయకులు ఆందోళనకు దిగారు. ఇదే క్రమంలో అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు వచ్చిన మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, విశ్వరూప్, వేణుగోపాల్ వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు అడ్డుకొని మంత్రులను గుడిలోకి తీసుకెళ్లి తలుపులు వేశారు. అనంతరం ఆయా సంఘాల ప్రతినిధులతో మంత్రులు చర్చలు జరపారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు.

Tags:    

Similar News