చిట్టెలుకల కొట్లాటకు ఉత్తమ అవార్డు
ఖాళీగా ఉన్న సబ్‌వే రైల్వే స్టేషన్లో రెండు చిట్టెలుకలు కొట్లాడుకుంటుండగా, ఓ వ్యక్తి అమాంతం అక్కడే పడుకుని, చేతిలో కెమెరాతో వాటిని ఫొటో తీశాడు. ఆయన ఫొటో తీస్తుండగా అక్కడున్న వాళ్లందరూ వింతగా చూశారు. వీడేంటి ఇలా కింద పడుకుని మరీ ఏం ఫొటోలు తీస్తున్నాడని తిట్టుకున్నారు. కొంతమంది మాత్రం అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందనుకుని సాయం చేయబోయారు. కానీ వాళ్లకి కనిపించనిదేదో అతని ఫొటోగ్రాఫర్ కంటికి కనిపించింది. […]
ఖాళీగా ఉన్న సబ్‌వే రైల్వే స్టేషన్లో రెండు చిట్టెలుకలు కొట్లాడుకుంటుండగా, ఓ వ్యక్తి అమాంతం అక్కడే పడుకుని, చేతిలో కెమెరాతో వాటిని ఫొటో తీశాడు. ఆయన ఫొటో తీస్తుండగా అక్కడున్న వాళ్లందరూ వింతగా చూశారు. వీడేంటి ఇలా కింద పడుకుని మరీ ఏం ఫొటోలు తీస్తున్నాడని తిట్టుకున్నారు. కొంతమంది మాత్రం అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందనుకుని సాయం చేయబోయారు. కానీ వాళ్లకి కనిపించనిదేదో అతని ఫొటోగ్రాఫర్ కంటికి కనిపించింది.
ఇప్పుడు అదే ఫొటో కారణంగా అతనికి ఉత్తమ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్, లూమిక్స్ పీపుల్స్ ఛాయిస్ అవార్డు దక్కింది. ఆ ఫొటో గ్రాఫర్ పేరు సామ్ రౌలీ. మొత్తంగా 28వేల మంది అభిమానులు అతని ఫొటోకు ఓట్లు వేసి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా నిలబెట్టారు. మొత్తం 48వేల ఎంట్రీల్లో అతని ఫొటో అవార్డు గెలవడం జీవితసాఫల్యమని సామ్ అన్నాడు.
ఈ ఫొటోతో పాటు మరో నాలుగు ఫొటోలను కూడా ఇంగ్లండ్‌లోని దక్షిణ కెన్సింగ్టన్ మ్యూజియంలో మే 31 వరకు ప్రదర్శించనున్నారు. సామ్ తీసిన ఫొటోలో మనుషుల ఆధిపత్యంలో జంతువుల జీవన పరిస్థితి కొట్టొచ్చినట్లు కనపడుతోందని మ్యూజియం డైరెక్టర్ సర్ మైకేల్ డిక్సన్ తెలిపారు.