గొర్రెల కొనుగోళ్లకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గొర్రెలు, మేకల పంపిణీపై ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. గొర్రెలు, మేకల కొనుగోళ్ల కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించింది. రాష్ట్ర స్థాయిలో ముగ్గురు అధికారులను కమిటీలో నియమించారు. పశుసంవర్థక శాఖ ఏడీ రామచందర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ శ్రీనాథ్, ఎం.నీహార్లు రాష్ట్రస్థాయి సెంట్రల్ మానిటరింగ్ సెల్‌గా వ్యవహరించనున్నారు. అదే విధంగా జిల్లాల వారీగా కూడా ఇంఛార్జీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటితో పాటుగా పలు […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గొర్రెలు, మేకల పంపిణీపై ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. గొర్రెలు, మేకల కొనుగోళ్ల కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించింది. రాష్ట్ర స్థాయిలో ముగ్గురు అధికారులను కమిటీలో నియమించారు. పశుసంవర్థక శాఖ ఏడీ రామచందర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ శ్రీనాథ్, ఎం.నీహార్లు రాష్ట్రస్థాయి సెంట్రల్ మానిటరింగ్ సెల్‌గా వ్యవహరించనున్నారు. అదే విధంగా జిల్లాల వారీగా కూడా ఇంఛార్జీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వీటితో పాటుగా పలు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన ప్రాంతాలను సైతం ఖరారు చేశారు. మహారాష్ట్రలోని నాంధేడ్, చంద్రాపూర్, షోలాపూర్, ఏపీలోని అనంతపూర్, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూల్, కడప, కర్ణాటకలోని యాద్గిరి, బళ్లారి, బీదర్, చిత్రదుర్గ్ ప్రాంతాల నుంచి గొర్రెలు, మేకలను కొనుగోలు చేయాల్సిన నిర్ణయించారు.
తెలంగాణలో గొర్రెల పెంపక శిక్షణ సంస్థ..
రాష్ట్రంలో గొర్రెల పెంపకం కోసం శిక్షణా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలున్నాయని కేంద్ర ఫిషరీస్, పశుసంవర్థక శాఖ మంత్రి ప్రతాప్‌చంద్ర సారంగి తెలిపారు. రాజ్యసభలో తెలంగాణ ఎంపీ బండా ప్రకాష్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రూ.18.5కోట్లతో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం మామిడిపల్లి గ్రామంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు.