ట్రాక్ అండ్ ఫీల్డ్‌లోకి ద్యుతీచంద్
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ ప్రభావంతో ఇంటికే పరిమితమైన భారత అథ్లెట్లు ఎట్టకేలకు శిక్షణా శిబిరాల్లోకి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ స్టేడియం, స్పోర్ట్స్ క్లాంప్లెక్స్‌ల్లో శిక్షణను ప్రారంభించారు. ఈనేపథ్యంలో రెండు నెలల విరామం అనంతర భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ శిక్షణకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రాక్స్ ప్రారంభించడం వల్ల అథ్లెట్లకు చాలా ఉపయోగపడుతుందన్నారు. రెండు నెలలు ఇంటి వద్దే ఉండటం వల్ల ఫిట్‌నెస్ తగ్గిపోతుందని, ఇప్పుడు […]
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ ప్రభావంతో ఇంటికే పరిమితమైన భారత అథ్లెట్లు ఎట్టకేలకు శిక్షణా శిబిరాల్లోకి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ స్టేడియం, స్పోర్ట్స్ క్లాంప్లెక్స్‌ల్లో శిక్షణను ప్రారంభించారు. ఈనేపథ్యంలో రెండు నెలల విరామం అనంతర భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ శిక్షణకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రాక్స్ ప్రారంభించడం వల్ల అథ్లెట్లకు చాలా ఉపయోగపడుతుందన్నారు. రెండు నెలలు ఇంటి వద్దే ఉండటం వల్ల ఫిట్‌నెస్ తగ్గిపోతుందని, ఇప్పుడు తక్షణమే చేయాల్సింది ఫిట్‌నెస్ పెంచుకోవడమేనని ద్యుతీ అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి జూలై 5 వరకు గడువు ఉంది. అయితే, ఒలింపిక్స్ ఏడాదిపాటు వాయిదా పడ్డాయి. కాబట్టి ట్రాక్ అండ్ ఫీల్డ్ అర్హత తేదీని కూడా పెంచుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, అవుట్ డోర్ ఫిట్‌నెస్ కేంద్రాలను పాటియాల, బెంగళూరు, ఊటీ కేంద్రాల్లో ప్రారంభించారు. అక్కడ ఆటగాళ్లకు శిక్షణ సమయంలో భౌతికదూరం పాటించడంతోపాటు లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నారు.