Harish Rao : బడుల మూసివేతకే 5,741 మంది టీచర్లను బదిలీ : హరీష్ రావు

ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని అభయహస్తం మ్యానిఫెస్టోలో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడుల మూసివేత చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ఎక్స్ లో ఆరోపించారు.

Update: 2024-11-28 09:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని అభయహస్తం మ్యానిఫెస్టోలో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడుల మూసివేత చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ఎక్స్ లో ఆరోపించారు. సంబంధిత వార్త కథనాలను పోస్టు చేశారు. అధికారం లోకి వచ్చి సంవత్సరం కాకముందే జీరో స్కూల్ పేరిట 1,899 స్కూల్ లు, 10 మంది లోపు విద్యార్థులు 4,314 స్కూల్లు మొత్తం కలిపి 6,213 స్కూలన్ని శాశ్వతంగా మూసి వేసే ప్రణాళిక లో భాగంగానే ఆ స్కూల్లో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కొరకు 7,289 కోట్లతో మన ఊరు - మన బడి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సన్న బియ్యంతో పౌష్ఠిక ఆహారం అందించారని గుర్తు చేశారు. రేవంత్ సర్కారు వచ్చీ రాగానే సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం రద్దు చేసి, మన ఊరు మన బడి ప్రోగ్రాం కొనసాగించక పోవడంతో, పురుగులన్నం, విషాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం వలన ప్రభుత్వ పాఠశాల పరపతి తగ్గి ఎన్ రోల్మెంట్ తగ్గుతోందని విమర్శించారు. ఒక్క సంవత్సరం లోనే 6,213 ప్రభుత్వ స్కూల్స్ మూత పడే దుస్థితికి రేవంత్ సర్కారు దిగజార్చిందని హరీష్ రావు ఆరోపించారు. 

Tags:    

Similar News