బయ్యారం ఆసుపత్రిలో సిబ్బంది కొరత.. పట్టించుకోని జిల్లా వైద్యాధికారులు
దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రభుత్వ ప్రైమరీ ఆసుపత్రి 2018 సంవత్సరంలో( ఎన్ క్యూ ఎస్ ) నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ సర్వీస్ సెంటరుగా గుర్తింపు వచ్చింది. దీనికి 18 లక్షల నిధులు వెచ్చించి మోడల్ ఆసుపత్రిగా 24 గంటలు పని చేసే విధంగా జిల్లా వైద్య అధికారులు అభివృద్ధి పరిచారు . ఎన్ క్యూ ఎస్ ద్వారా ప్రతి సంవత్సరం 3 లక్షలు నిధులు వెచ్చించాలి. 2019 సంవత్సరంలో రెండు లక్షల నిధులు అధికారులు […]
దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రభుత్వ ప్రైమరీ ఆసుపత్రి 2018 సంవత్సరంలో( ఎన్ క్యూ ఎస్ ) నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ సర్వీస్ సెంటరుగా గుర్తింపు వచ్చింది. దీనికి 18 లక్షల నిధులు వెచ్చించి మోడల్ ఆసుపత్రిగా 24 గంటలు పని చేసే విధంగా జిల్లా వైద్య అధికారులు అభివృద్ధి పరిచారు . ఎన్ క్యూ ఎస్ ద్వారా ప్రతి సంవత్సరం 3 లక్షలు నిధులు వెచ్చించాలి. 2019 సంవత్సరంలో రెండు లక్షల నిధులు అధికారులు వెచ్చించారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుండి నేటి వరకు ఎన్ క్యూఎస్ ద్వారా, నిధులు మంజూరి కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా ఆసుపత్రి ( హెచ్ డీఎస్ ) హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటి ద్వారా మెయింటనెన్స్ ఖర్చుల నిమిత్తం ప్రతి సంవత్సరం రావాల్సిన నిధులు మంజూరు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ 1, స్టాఫ్ నర్సులు 3 , డయాగ్నిటిక్ 1, ఏఎన్ ఎమ్ 4, ఫీల్డ్ నర్సులు 6, నైట్ వాచ్ మెన్ , అటెండర్, సూపర్ వైజర్ మేల్ , ఫిమేల్ , సిబ్బంది అవసరం ఉండగా, బయ్యారం మోడల్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులు 1, డయాగ్నిటిక్ విధులు నిర్వహించే అతన్ని జిల్లా కేంద్రంలోని తెలంగాణ టీ హబ్‌కు డిప్యూటేషన్ పంపారు. ఇద్దరు స్టాప్ నర్సులు వేరే చోటకి బదిలీ పై వెళ్లారు. ఆసుపత్రిలో (ఎన్ సీడీ) నాన్ కమ్యూనికెబుల్ డిసీజెస్ కాంట్రాక్టు సిబ్బంది తమ రోజు వారి ఓపీలు, షుగర్ , బీపీ, చెకింగ్ చేసి వారి డేటాను ఆన్ లైన్‌లో పొందుపరిచి కార్డు మంజూరు చేయాలి. అటెండర్ 2014 సంవత్సరంలో ప్రమోషన్ ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లారు. అప్పటినుండి నేటి వరకు అటెండర్ లేరు. స్లీపర్‌గా ఇద్దరు పగలు , రాత్రి సమయాలలో షిప్టుల వారిగా సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతూ తమ విధులు నిర్వహిస్తున్నారు.
సిబ్బంది కొరతతో రోగులకు అర కొర వైద్య సేవలు
ఆసుపత్రిలో ఇద్దరు స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉండటంతో వారి స్థానంలో ఇద్దరి ఏఎన్ ఎమ్‌లు , ఎన్ సీడీ కాంట్రాక్టు సిబ్బందితో షిప్టుల వారిగా .. ఆసుపత్రికి వచ్చే ఓపి రోగులకు డయాగ్నిటిక్ విధులలో భాగంగా రక్త నమూనాలు, ఇతర వైద్య సేవలు, డెలివరీ కేసుల కోసం రాత్రి సమయాలలో సేవలందిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది డ్యూటి సమయం ముగించుకొని ఇంటికి వెళ్లిన వారికి మెడికల్ ఆఫీసర్ ఫోన్లు చేసి పిలిపించి డెలివరీ కేసులు చేయాలని చెప్పడంతో, వారు మళ్లీ వచ్చి డెలివరీ చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్ ఎమ్‌లు తమ ఫీల్డ్‌లో చేసే పనులు అదనంగా చేస్తున్నారు. సిబ్బంది వారం రోజులు డ్యూటి చేసి వీక్లీ ఆఫ్‌లు లేకుండా నిత్యం సేవలు అందిస్తున్నట్లు సిబ్బంది తెలుపుతున్నారు.
మండలంలోని కొత్త పేట పంచాయితి పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, 3 స్టాఫ్ నర్సులు , ఇతర వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. మండలంలోని గధంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 12 గంటల పాటు విధులు నిర్వహించాల్సిన చోట ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. ఇతర సిబ్బంది కొరత లేకుండా జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు చేశారు. మండల కేంద్రంలోని మోడల్ ఆసుపత్రిలో మాత్రం సిబ్బంది కొరతతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పదించి మోడల్ ఆసుపత్రిలో సిబ్బంది కొరత లేకుండా చేయాలని, నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని పలువురు వేడుకుంటున్నారు.