పిల్లల అక్రమ రవాణా నిజమే: ఆర్కే మీనా
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని సృష్టి ఆస్పత్రి నుంచి పసిపిల్లల అక్రమ రవాణా జరుగుతోందని సీపీ ఆర్కే మీనా నిర్ధారించారు. గత నెల 24న సుందరమ్మ అనే మహిల సృష్టి ఆస్పత్రిలో చైల్డ్ ట్రాఫికింగ్‌పై ఫిర్యాదు చేసిందని చెప్పారు. బిడ్డ పుట్టిన తరువాత కోల్‌కతాలోని దంపతులకు విక్రయించారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించగా, సృష్టి ఆస్పత్రి కేంద్రంగా ఛైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్ నడుస్తున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. ఈ కేసులో 8 మందిని […]
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని సృష్టి ఆస్పత్రి నుంచి పసిపిల్లల అక్రమ రవాణా జరుగుతోందని సీపీ ఆర్కే మీనా నిర్ధారించారు. గత నెల 24న సుందరమ్మ అనే మహిల సృష్టి ఆస్పత్రిలో చైల్డ్ ట్రాఫికింగ్‌పై ఫిర్యాదు చేసిందని చెప్పారు. బిడ్డ పుట్టిన తరువాత కోల్‌కతాలోని దంపతులకు విక్రయించారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించగా, సృష్టి ఆస్పత్రి కేంద్రంగా ఛైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్ నడుస్తున్నట్టు నిర్ధారణ అయిందన్నారు.
ఈ కేసులో 8 మందిని నిందితులుగా చేర్చామన్న ఆయన ప్రధాన నిందితురాలుగా సృష్టి ఆస్పత్రి ఎండీ నమ్రత ఉందని మీనా వెల్లడించారు. ఈ రాకెట్‌లో ఇద్దరు ఆశా వర్కర్ల ప్రమేయం కూడా ఉందని చెప్పిన ఆయన, ఇప్పటివరకు ఆరుగుర్ని అరెస్టు చేశామని తెలిపారు. వీరికి పేదలే లక్ష్యమని, వారిని లక్ష్యంగా చేసుకునే ఆశావర్కర్లతో పని నడిపిస్తారని, ఫైనల్‌గా వచ్చిన డబ్బులో వాటాలు పంచుకుంటారని వివరణ ఇచ్చారు.