EVM, వీవీప్యాట్ల భద్రతపై పుకార్లు.. స్ట్రాంగ్ రూమ్ సీసీ టీవీ ఫుటేజీ ఇదే (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన పార్టీలన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటర్లను వివిధ రూపాల్లో ప్రలోభాలకు గురిచేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలింగ్ పూర్తి అవడంతో.. ఓటర్లు, అభ్యర్థులు చూపు ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతపై పడింది. కేంద్ర బలగాల, పోలీసులతో స్ట్రాంగ్ రూమ్‌లకు భద్రత కల్పిస్తామని ఎన్నికల సంఘం చెబుతోంది. అయితే, శనివారం రాత్రి వీవీప్యాట్‌ను ఓ […]
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన పార్టీలన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటర్లను వివిధ రూపాల్లో ప్రలోభాలకు గురిచేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలింగ్ పూర్తి అవడంతో.. ఓటర్లు, అభ్యర్థులు చూపు ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతపై పడింది. కేంద్ర బలగాల, పోలీసులతో స్ట్రాంగ్ రూమ్‌లకు భద్రత కల్పిస్తామని ఎన్నికల సంఘం చెబుతోంది.
అయితే, శనివారం రాత్రి వీవీప్యాట్‌ను ఓ వ్యక్తి తీసుకొని ప్రైవేట్ కారులో పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భద్రతపై అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇదే సమయంలో ఎన్నికల అధికారులు మాత్రం భద్రత విషయంలో పుకార్లు నమ్మొద్దని చెబుతున్నారు.
ఈ క్రమంలో కరీంనగర్‌లోని SRR కాలేజీ వద్ద ఉన్న భద్రతపై సీసీ టీవీ ఫుటేజీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. వైరల్‌గా మారింది. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలు అప్రమత్తంగా ఉండి పహారా కాస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లను మూడంచెల భద్రత నడుమ, సీసీ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.