శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
దిశ, వెబ్‌డెస్క్: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇన్‌ఫ్లో 1,12,565 క్యూసెక్కులు ఉండగా, మూడు గేట్లు ఎత్తి 1,14,886 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 215టీఎంసీలు కాగా, ప్రస్తుతం 214టీఎంసీల నీరు నిల్వ ఉంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా.. కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి.