శ్రీశైలానికి వరద ఉధృతి

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 1,07,316 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 38,140 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 844.20 అడుగులకు చేరడం విశేషం. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 68.7145 టీఎంసీలుగా నమోదు […]

Update: 2020-07-20 23:56 GMT

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 1,07,316 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 38,140 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 844.20 అడుగులకు చేరడం విశేషం. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 68.7145 టీఎంసీలుగా నమోదు అయ్యింది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Tags:    

Similar News