బ్రేకింగ్.. శ్రీరాంసాగర్ 27 గేట్లు ఎత్తివేత
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 44,510 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తున్న కారణంగా అధికారులు ప్రాజెక్టు 27గేట్లును ఎత్తివేశారు. సాగర్‌కు ఆదివారం రాత్రి 9 గంటలకు ఇన్ ఫ్లో 44,510 క్యూసెక్కులు వస్తుండగా ఔట్ ఫ్లో 99,840 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం1,091 అడుగులతో 90.313 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1,090.9 అడుగులు 89.763 టీఎంసీల నీరు నిల్వ ఉంది. […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 44,510 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తున్న కారణంగా అధికారులు ప్రాజెక్టు 27గేట్లును ఎత్తివేశారు.
సాగర్‌కు ఆదివారం రాత్రి 9 గంటలకు ఇన్ ఫ్లో 44,510 క్యూసెక్కులు వస్తుండగా ఔట్ ఫ్లో 99,840 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం1,091 అడుగులతో 90.313 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1,090.9 అడుగులు 89.763 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కారణంగా ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.