Women Commission : మహిళా ఏఈఓలకు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌‌ భరోసా

తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌ నేరెళ్ళ శారద‌తో తాజాగా మహిళా అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ భేటీ అయ్యారు.

Update: 2024-11-05 12:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: Telangana Women Commission తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌ నేరెళ్ళ శారద‌ Nerella Sharada తో మహిళా అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ భేటీ అయ్యారు. డిజిటల్ క్రాప్ సర్వేలో ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్‌ నేరెళ్ళ శారద దృష్టికి మహిళా ఏఈఓలు తీసుకొచ్చారు. మహిళా ఏఈఓలకు అండగా ఉండాలంటూ చైర్మన్‌కు తాజాగా వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా నేరెళ్ళ శారద‌ భరోసా ఇచ్చారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన Digital Crop Survey డిజిటల్ క్రాప్ సర్వేను తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సర్వే అమలుపరిచే ప్రక్రియలో కలిగే ఇబ్బందులపై గత కొన్ని రోజుల నుంచి AEOs ఏఈఓలు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఏఈఓలుగా మహిళలు ఎక్కువగా ఉండటంతో వారి భద్రతపై కనీసం కనికరం చూపడం లేదని గత నిరసనల సమయంలో మహిళా ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..