Telangana:విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి ఒంటిపూట బడులు
రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ప్రభుత్వం(TG Government) చేయనున్న కులగణన సర్వే(Census Survey)లో ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ల టీచర్ల(Primary school teachers)ను వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఆయా స్కూళ్ల టీచర్లు మూడు వారాలపాటు కుల గణనలో పాల్గొంటారని, కాబట్టి ప్రాథమిక పాఠశాలలు మధ్యాహ్నం వరకే పనిచేస్తాయని పేర్కొంది. ప్రాథమిక పాఠశాలలు ఒంటి గంట వరకు పనిచేసిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాల్సిందేనని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సర్వే పూర్తయ్యే వరకు ఈ ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఈ సర్వేను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం(Government) అధికారులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు(Secondary Grade Teachers), 3,414 మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సేవలను కుల గణనకు వినియోగించుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ ఒంటిపూట బడులు కేవలం ప్రైమరీ పాఠశాలలకే వర్తించనుందని, హైస్కూళ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.