KTR: సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయింది.. కేటీఆర్ హాట్ కామెంట్స్

సర్కార్ ఆనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం (State Income) పూర్తిగా పడిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు.

Update: 2024-11-05 11:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: సర్కార్ ఆనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం (State Income) పూర్తిగా పడిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ ఆయన శ్రీనగర్ కాలనీ (Srinagar Colony)లో నిర్వహించిన రియల్టర్స్ ఫోరం (Realtors Forum) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (United Andhra Pradesh)లో రైతులకు మేలు చేయాలనే ఆలోచన పాలకులకు ఉండేది కాదని కామెంట్ చేశారు. రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా.. నీళ్లు లేకపోయేసరికి భూములు నిరుపయోగంగా ఉండేవని తెలిపారు.

2014 ముందు రాష్ట్రంలో భూముల ధరలు చాలా తక్కువగా ఉండేవని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా సమైక్య పాలకులు తెలంగాణ (Telangana)లో రియల్ ఎస్టేట్ (Real Estate) పడిపోతుందని భయపెట్టారని గుర్తు చేశారు. కానీ, పదేళ్ల కేసీఆర్ (KCR) సుస్థిర పాలన వల్లే రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని తెలిపారు. ఆయన నాయకత్వంలో సాగునీటి సదుపాయాలు మెరుగలయ్యాయని కొనియాడారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని, రియాల్టర్ల ఏడుపొక్కటే తక్కువైందని ఆరోపించారు.

11 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏ ఒక్క మంచి నిర్ణయం తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ‘హైడ్రా’ (HYDRA) పేరుతో బ్లాక్‌మెయిల్ దందా మొదలు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణ ప్రజలు ఇళ్ల నిర్మాణాలు, అనుమతుల కోసం ఎక్కడికి వెళ్లాలో.. ఎవరిని కలవాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిన నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని అన్నారు. ఢిల్లీ (Delhi)కి మూటలు పంపడం కోసం ఆగమాగం నిర్ణయాలు తీసుకుంటున్నారని కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు.     

Tags:    

Similar News