తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రపోజల్ లేదు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తారనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు స్పందించారు. తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధించే ప్రపోజల్ లేదని శ్రీనివాస్‌రావు క్లారిటీ ఇచ్చారు. విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని, విద్యార్థుల ద్వారా ఇంట్లోని వారికి కరోనా సోకే అవకాశముందన్నారు. కేసులు మళ్లీ […]

Update: 2021-03-22 06:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తారనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు స్పందించారు.

తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధించే ప్రపోజల్ లేదని శ్రీనివాస్‌రావు క్లారిటీ ఇచ్చారు. విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని, విద్యార్థుల ద్వారా ఇంట్లోని వారికి కరోనా సోకే అవకాశముందన్నారు.

కేసులు మళ్లీ పెరుగుతుండటం చూస్తుంటే.. తెలంగాణలో సెకండ్ వేవ్ మొదలైందని చెప్పాలని, గత ఏడాది ఏ చర్యలు చేపట్టామో.. అవే మళ్లీ మొదలయ్యాయన్నారు. ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని, అర్హులైన వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.

Tags:    

Similar News