జవాన్ కుటుంబానికి మేం ఎప్పుడు అండగా ఉంటాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

దిశ, పరిగి: విధి నిర్వహలో అమరుడైన జవాన్ కుటుంబానికి మనమంతా అండగా ఉండాలని రాష్ర్ట ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా మహ్మదాబాద్ మండల పరిధిలోని గువ్వనికుంట తండకు చెందిన పరుశురాం నాయక్ (జవాన్) గత సంవత్సరం విధి నిర్వహణలో వీర మరణం పొందాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్సగ్రేషియా రూ. 25 లక్షల చెక్కు, రెండున్నర ఎకరాల భూమి పట్టాకు సంబంధించిన పత్రాలు పరుశురాం కుటుంబానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, […]

Update: 2021-12-22 11:56 GMT

దిశ, పరిగి: విధి నిర్వహలో అమరుడైన జవాన్ కుటుంబానికి మనమంతా అండగా ఉండాలని రాష్ర్ట ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా మహ్మదాబాద్ మండల పరిధిలోని గువ్వనికుంట తండకు చెందిన పరుశురాం నాయక్ (జవాన్) గత సంవత్సరం విధి నిర్వహణలో వీర మరణం పొందాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్సగ్రేషియా రూ. 25 లక్షల చెక్కు, రెండున్నర ఎకరాల భూమి పట్టాకు సంబంధించిన పత్రాలు పరుశురాం కుటుంబానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అందజేశారు. అంతేకాకుండా మహ్మదాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ, నాయకులు సుధాకర్ రెడ్డి, కమతం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News