డీఎస్పీగా భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రభుత్వ విభాగాల్లోని పలు శఆఖల్లో క్లాస్-1, క్లాస్-2 అధికారులుగా నియమించాలని, ఈ మేరకు క్రీడా విధానాన్ని సవరించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న భారత స్ప్రింటర్ హిమదాస్‌కు డీఎస్పీ హోదాలో ఉద్యోగం […]

Update: 2021-02-11 08:17 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రభుత్వ విభాగాల్లోని పలు శఆఖల్లో క్లాస్-1, క్లాస్-2 అధికారులుగా నియమించాలని, ఈ మేరకు క్రీడా విధానాన్ని సవరించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న భారత స్ప్రింటర్ హిమదాస్‌కు డీఎస్పీ హోదాలో ఉద్యోగం ఇవ్వాలని తీర్మానించారు. ఒలంపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని క్లాస్-1 అధికారులుగా, ప్రపంచ చాంపియన్‌షిప్ విజేతలను క్లాస్-2 ఉద్యోగులుగా నియమించాలని క్రీడా విధానాన్ని మార్చారు. ఈ మేరకు హిమదాస్‌ను డీఎస్పీగా నియమించినట్లు సీఎం సోనోవాల్ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు. హిమదాస్‌ను డీఎస్పీగా నియమించడంపై కేంద్ర క్రీడ, యువజన శాఖ మంత్రి కిరణ్ రెజిజు అస్సాం ప్రభుత్వాన్ని అభినందించారు. హిమదాస్ ప్రస్తుతం ఒలంపిక్స్ క్రీడల కోసం సన్నద్దం అవుతున్నారు.

Tags:    

Similar News