Zaka Ashraf: పాక్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​గా జకా అష్రాఫ్​..

పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు నూతన ఛైర్మన్​గా జకా అష్రాఫ్​ నియమితులయ్యారు.

Update: 2023-07-06 12:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు నూతన ఛైర్మన్​గా జకా అష్రాఫ్​ నియమితులయ్యారు. మొత్తం నాలుగు నెలలపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. పీసీబీ మేనేజ్​మెంట్​ కమిటీ కొత్త ఛైర్మన్​గా జకా అష్రాఫ్​ నియమితులయ్యారు. 10 మంది సభ్యులతో కూడిన బోర్డు మేనేజ్​మెంట్​ కమిటీకి ఆయన సారథ్యం వహించనున్నారని ఈఎస్​పీఎన్​ క్రిక్​ ఇన్​ఫో వెబ్​సైట్​ తాజాగా ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ కూడా ఉన్నారు.

పీసీబీ 10 మంది సభ్యుల కమిటీలో.. కలీమ్ ఉల్లా ఖాన్, అషాఫక్ అక్తర్, ముస్సాదిక్ ఇస్లాం, అజ్మత్ పర్వేజ్, జహీర్ అబ్బాస్, ఖుర్రం సూమ్రో, ఖవాజా నదీమ్, ముస్తఫా రామ్‌డే జుల్ఫికర్ మాలిక్ ఉన్నారు. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీలు బోర్డు ఛైర్మన్‌గా తమ వ్యక్తులే ఉండాలని పట్టుబట్టడంతో గతంలో పీసీబీ రేసు నుంచి నజం సౌథీ తప్పుకున్న విషయం తెలిసిందే. గత నెలలోనే అతను తప్పుకోవడంతో జకా అష్రాఫ్ ను నియమించేందకు మార్గం సుగమమైంది.


Similar News