శతక్కొట్టిన బ్యాటు నాది కాదు.. అతనిది : అభిషేక్ శర్మ

Update: 2024-07-08 14:24 GMT

దిశ, స్పోర్ట్స్ : జింబాబ్వేతో రెండో టీ20లో టీమ్ ఇండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయిన అతను.. రెండో టీ20లో శతక్కొట్టాడు. ఆ మ్యాచ్‌లో అభిషేక్ వాడిన బ్యాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ది అట. ఈ విషయాన్ని అభిషేకే రివీల్ చేశాడు. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో పోస్టు చేసింది. అభిషేక్ మాట్లాడుతూ.. ‘సరైన సమయంలో బ్యాటు ఇచ్చినందుకు గిల్‌కు స్పెషల్ థాంక్యూ. అండర్-14 నుంచి అతని బ్యాటు వాడుతున్నాను. అతని బ్యాటుతో ఎప్పుడు ఆడిన బాగా రాణిస్తాను. అతను సులభంగా బ్యాటు ఇవ్వడు. అందుకు చాలా కష్టపడాలి. అతని బ్యాటుతో ఆడితే ఫామ్ అందుకుంటా.’ అని చెప్పుకొచ్చాడు.

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను అభిషేక్ ఎంత ఆరాధిస్తాడో ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. యువీని తన మెంటార్‌గా పేర్కొంటాడు. అలాగే, యువీ కూడా అభిషేక్‌ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడంలో సహాయపడతాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్‌తో వీడియో కాల్ మాట్లాడిన యువీ అతన్ని అభినందించాడు. యువీ గురించి అభిషేక్ మాట్లాడుతూ.. ‘తొలి టీ20 తర్వాత అతనితో మాట్లాడా. డకౌట్ అయితే సంతోషపడ్డాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. గుడ్ స్టార్ట్ అని చెప్పాడు. ఇదంతా అతని వల్లే. 2-3 మూడేళ్లుగా నా కోసం చాలా కష్టపడ్డాడు. మైదానంలోనే కాకుండా జీవితంలో కూడా.’ అని చెప్పుకొచ్చాడు. 


Similar News