Border, Gavaskar Trophy: బోర్డర్, గవాస్కర్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ.. మరోసారి షమీకి దక్కని చోటు

అత్యంత ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) కోసం ఆస్ట్రేలియా (Australia)తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సరీస్‌కు భార‌త జ‌ట్టు (Team India)ను ఇవాళ బీసీసీఐ (BCCI) ప్రకటించింది.

Update: 2024-10-26 03:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) కోసం ఆస్ట్రేలియా (Australia)తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సరీస్‌కు భార‌త జ‌ట్టు (Team India)ను ఇవాళ బీసీసీఐ (BCCI) ప్రకటించింది. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, అభిమన్యు ఈశ్వర్‌లకు జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా గాయం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న మహమ్మద్ షమీ (Mohammed Shami)కి జట్టులో చోటు లభించలేదు. ఇటీవల నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేసిన షమీ (Shami)ని టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేస్తారని భావించినా అతడు పూర్తిగా కోలుకోకపోవడంతో జట్టులో అవకాశం కల్పించ లేదు. అదేవిధంగా గజ్జల్లో గాయంతో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) బోర్డర్-గవస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)కి దూరమయ్యాడు. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ (Washington Sunder)ను ఆసీస్ పర్యటనకు ఎంపిక చేశారు.

కాగా, నవంబర్ 22న పెర్త్‌(Perth)లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohith Sharma), వైస్ కెప్టెన్‌గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వ్యవహరించనున్నారు. షమీ (Shami) స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా (Harshith Rana) తొలిసారి టెస్టు జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక ఎటాకింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Panth), ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) ఇద్దరు వికెట్ కీపర్లకు జ‌ట్టులో చోటు దక్కింది. అదేవిధంగా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, బుమ్రా, రానాతో పాటు ఇతర పేసర్లు మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జ‌ట్టులో ఉన్నారు. ఇక పేసర్లు ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్ రిజర్వ్‌ ప్లేయర్లుగా ఎంపిక‌య్యారు.

భారత జట్టు ఇలా..

రోహిత్ శర్మ (C), జస్ప్రీత్ బుమ్రా (VC), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (WK), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (WK) , ర‌విచంద్రన్ అశ్విన్, ర‌వీంద్ర జడేజా, మ‌హ్మద్‌ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.


Similar News