డేవిడ్ వార్నర్‌పై జీవితకాల కెప్టెన్సీ నిషేధం ఎత్తివేత!

ఆసీస్ డ్యాషింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా గుడ్‌న్యూస్ చెప్పింది. గతంలో అతడిపై విధించిన జీవితకాల ‘కెప్టెన్సీ’ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-25 19:47 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆసీస్ డ్యాషింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌ (David Warner)కు క్రికెట్ ఆస్ట్రేలియా గుడ్‌న్యూస్ చెప్పింది. గతంలో అతడిపై విధించిన జీవితకాల ‘కెప్టెన్సీ’ నిషేధాన్ని (Life time Ban) ఎత్తివేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2018లో సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా బంతిని సాండ్‌ పేపర్ రుద్దిన నేపథ్యంలో ఆ మ్యాచులో వైస్ కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌పై ‘జీవితకాల కెప్టెన్సీ’పై నిషేధం పడింది.

తనపై బ్యాన్‌ను ఎత్తివేయాలని వార్నర్ పలుమార్లు బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. దీనిపై ముగ్గురు సభ్యులతో కూడిన రివ్యూ ప్యానెల్‌ ఏకగ్రీవంగా తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు ఆసీస్ లీగ్‌ల్లోనూ కెప్టెన్సీ చేపట్టకుండా ఉన్న వార్నర్.. రాబోయే బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నది. కాగా, ఇటీవల తన టెస్టు రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటానని డేవిడ్ వార్నర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News