'బుమ్రా.. నువ్వు ముందు ఇండియన్ ప్లేయర్.. ఐపీఎల్ ముఖ్యం కాదు'

టీమిండియా పేసర్ బుమ్రా గత కొంత కాలంగా వెన్ను గాయం కారణంగా 5 నెలలుగా టీమ్‌కు దూరంగా ఉన్నాడు.

Update: 2023-02-21 12:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా పేసర్ బుమ్రా గత కొంత కాలంగా వెన్ను గాయం కారణంగా 5 నెలలుగా టీమ్‌కు దూరంగా ఉన్నాడు.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతోపాటుగా ఆసీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు కూడా ఆడటం లేదని స్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో మార్చి 31 నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్‌కు మాత్రం అతడు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. అటు బుమ్రా తోపాటు ముంబై ఫ్రాంఛైజీ కి కూడా కీలక సూచన చేశాడు.

బుమ్రా.. నువ్వు ముందు ఇండియన్ ప్లేయర్.. ఐపీఎల్ ముఖ్యం కాదని.. అటు ఐపీఎల్‌లో అతనిపై భారం తగ్గించే బాధ్యత కూడా ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ పై ఉందని స్పష్టం చేశాడు. బుమ్రా పరిస్థితిని బట్టి.. బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్, ముంబై ఇండియన్స్ కలిసి ఐపీఎల్‌లో అతనిపై పనిభారం గురించి నిర్ణయం తీసుకోవాలని చోప్రా సూచించాడు. బుమ్రా ఫిట్‌గా ఉంటే ఇరానీ ట్రోఫీ, కౌంటీ క్రికెట్ లాంటివి ఆడాలని కూడా చోప్రా సూచించాడు. ఐపీఎల్‌కు మరో నెల రోజుల సమయం ఉన్నదని, అందులో బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడతాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశాడు.

Tags:    

Similar News