Yashaswi Jaiswal: యశస్వీ జైస్వాల్ దూకుడు.. గౌతం గంభీర్ రికార్డ్ గల్లంతు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా పెర్త్ (Perth) వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్‌లో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు.

Update: 2024-11-23 09:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా పెర్త్ (Perth) వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్‌లో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ క్రమంలోనే అతడు టీమిండియా (Team India) హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ (Goutham Gambhir) నెలకొల్పిన 16 ఏళ్ల రికార్డును చెరిపేశాడు. 2008లో టీమిండియా (Team India) తరఫున గౌతం గంభీర్ ఒకే క్యాలెండర్ ఇయర్‌ (Calendar Year)లో 1,134 పరుగులు చేయగా.. యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) ఆ రికార్డును 1,170 పరుగులు చేసి అధిగమించాడు. ఇప్పటి వరకు 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యశస్వీ జైస్వాల్ 26 ఇన్నింగ్స్‌లలో 70.13 స్ట్రైక్ రేట్‌తో 1,407 పరుగులు చేశాడు. అందులో ఓ డబుల్ సెంచరీ, 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఓకే క్యాలెండర్ ఇయర్‌ (Calendar Year)లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో యశస్వీ కంటే ముందు 1,338 పరుగులతో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ ఉన్నాడు.        

Tags:    

Similar News