ఐసీసీ అవార్డుల రేసులో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్

ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డుల రేసులో టీమిండియా యంగ్ ప్లేయర్ ఉన్నాడు. మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు నామినీస్‌ జాబితాలో యశస్వి జైస్వాల్‌ చోటు సంపాదించాడు.

Update: 2024-01-03 14:19 GMT

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డుల రేసులో టీమిండియా యంగ్ ప్లేయర్ ఉన్నాడు. మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు నామినీస్‌ జాబితాలో యశస్వి జైస్వాల్‌ చోటు సంపాదించాడు. ఈ రేసులో యశస్వితో పాటు న్యూజిలాండ్‌ ప్లేయర్ రచిన్‌ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ, శ్రీలంక పేసర్‌ దిల్షన్‌ మధుషంక నిలిచారు. గతేడాది ప్లేయర్ల పెర్ఫామెన్స్ ఆధారంగా ఆటగాళ్లను నామినేట్ చేసింది ఐసీసీ. యశస్విజైస్వాల్ భారత్ తరఫున అరంగేట్ర టెస్టు మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టాడు. వెస్టిండీస్ తో ఆడిన టెస్టు మ్యాచ్ లో 171 పరుగులు చేసి వావ్ అనిపించాడు. ఆడిన మూడు టెస్టు మ్యాచుల్లో ఒక సెంచరీ,ఒక హాఫ్ సెంచరీతో 288 పరుగులు చేశాడు. 2023లో 15 టీ20లు ఆడిన జైస్వాల్ 33.07 సగటుతో 430 పరుగులు చేశాడు.


Similar News