ఆస్ట్రేలియాను వెనక్కినెట్టిన భారత్.. తిరిగి రెండో స్థానానికి
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో భారత్ తిరిగి 2వ స్థానం సాధించింది.
దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో భారత్ తిరిగి 2వ స్థానం సాధించింది. గత వారం దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ వరుసగా రెండు టెస్టులు నెగ్గి అగ్రస్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. టాప్ పొజిషన్‌లో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోగా.. భారత్ మూడో స్థానానికి పరిమితమైంది. తాజాగా రాజ్‌కోట్ టెస్టు విజయంతో టీమ్ ఇండియా తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని ఆస్ట్రేలియాను వెనక్కినెట్టింది. ఒక్క స్థానం ఎగబాకి 59.52 పర్సంటేజ్‌తో రెండో స్థానానికి చేరుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సర్కిల్‌లో భారత్ మొత్తం 7 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు విజయాలు సాధించింది. ఓ డ్రా, రెండు ఓటములు పొందింది. న్యూజిలాండ్ 75 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వరుసగా టాప్-5లో ఉన్నాయి. వరుసగా రెండు టెస్టులో ఓడిన ఇంగ్లాండ్ 21.87 పర్సంటేజ్‌తో 8వ స్థానంలో ఉన్నది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ సేన విజయం సాధిస్తే టాప్ పొజిషన్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.