WPL 2023: ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ముంబై ఇండియన్స్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై జట్టు వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై జట్టు వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం గుజరాత్ జెయింట్స్ పై ముంబై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు WPL పాయింట్ల పట్టికలో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి టేబుల్ టాప్‌గా ఉంది. అలాగే.. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2023 ప్లేఆఫ్‌లకు అర్హత సాధించిన మొదటి జట్టుగా MI అవతరించింది. కాగా, GG ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.