మెరిసిన మనిక.. హంగారీపై భారత్ గెలుపు

సౌత్ కొరియాలో జరుగుతున్న వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు పుంజుకుంది.

Update: 2024-02-18 17:04 GMT

దిశ, స్పోర్ట్స్ : సౌత్ కొరియాలో జరుగుతున్న వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు పుంజుకుంది. తొలి గ్రూపు మ్యాచ్‌లో చైనాతో ఓడిన భారత్ ఆదివారం జరిగిన రెండో గ్రూపు మ్యాచ్‌లో హంగేరిపై 3-2 తేడాతో విజయం సాధించింది. భారత స్టార్ క్రీడాకారిణి మనిక బాత్రా రెండు గేమ్‌ల్లో నెగ్గి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలి గేమ్‌లో మనిక 3-2 తేడాతో డొర మదరాస్జ్‌ను ఓడించి జట్టుకు శుభారంభం అందించింది. ఈ మ్యాచ్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ నిరాశపర్చింది. రెండు, నాలుగు గేమ్‌ల్లో పరాజయం చవిచూసింది. మూడో గేమ్‌లో అహికా ముఖర్జీ నెగ్గింది. నాలుగు గేముల్లో ఇరు జట్లు 2-2తో నిలిచాయి. నిర్ణయాత్మక ఐదో గేమ్‌లో మనిక 3-0 తేడాతో జార్జినాను చిత్తు చేయడంతో భారత్ విజయం సాధించింది. మరోవైపు, పురుషుల జట్టు 1-3 తేడాతో పొలాండ్ చేతిలో ఓడిపోయింది.

Tags:    

Similar News