World Cup 2023: జింబాబ్వేపై శ్రీలంక విజయం.. వన్డే ప్రపంచకప్‌కు అర్హత
ICC ODI World Cup-2023 Qualifiersలో భాగంగా జింబాబ్వేతో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్: ICC ODI World Cup-2023 Qualifiersలో భాగంగా జింబాబ్వేతో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 8 పాయింట్లు సాధించిన శ్రీలంక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ విజయంతో భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు శ్రీలంక క్వాలిఫై అయింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో.. సీన్ విలియమ్స్(57 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ 4 వికెట్లు తీయగా.. మదుషంక 3 వికెట్లు, పతిరణ 2 వికెట్లు సాధించారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 33.1 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సంక(101) అజేయ శతకంతో చెలరేగాడు. అతడితో పాటు కరుణరత్నే(30) రాణించాడు.