Wimbledon 2023: 200 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి.. కూల్‌గా పట్టేసిన చైర్ అంపైర్ (వీడియో)

వింబుల్డన్‌ టోర్నమెంట్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Update: 2023-07-10 10:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: వింబుల్డన్‌ టోర్నమెంట్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచ నెంబర్ వన్ కార్లోస్ అల్కారెజ్ ఆడుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ టోర్నీ తొలి రెండు రౌండ్లలో నెగ్గిన అల్కారెజ్.. మూడో రౌండ్‌లో నికోలస్ జారీతో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో నికోలస్ సర్వ్‌ను కార్లోస్ రిటర్న్ చేశాడు. ఈ సమయంలో కార్లోస్ రిటర్న్ ఏకంగా 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. అయితే అది ప్రత్యర్థి వైపు కాకుండా.. చైర్ అంపైర్ వైపు బంతి వేగంగా వెళ్లింది. మరెవరైనా అయితే ఆ బంతి తగిలి కిందపడతారేమో..? కానీ ఆ అంపైర్ మాత్రం చాలా క్విక్‌గా రియాక్ట్ అయ్యాడు. చటుక్కున ఆ బంతిని చేత్తో పట్టేశాడు. ఇలా 200 కిలోమీటర్ల వేగంతో వస్తున్న బంతిని అతను క్యాచ్ పట్టేయడం చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. పెద్దగా చప్పట్లు కొడుతూ అతన్ని అభినందించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన చాలా మంది ఫ్యాన్స్ షాకవుతున్నారు. 'అతను క్యాచ్ పట్టడం కాదు. చాలా కూల్‌గా ఉన్నాడు. ఏమాత్రం తడబడలేదు. అది కదా క్లాస్ అంటే' అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో నెంబర్ వన్ కార్లోస్ అల్కారెజ్ అద్భుతమైన విజయం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో కార్లోస్ 6-3, 6-7 (8), 6-3, 7-5 తేడాతో నికోలస్‌ను ఓడించాడు.


Similar News