Wimbledon 2023: రెండో రౌండ్‌లో భారత ప్లేయర్‌..

Wimbledon 2023లో బాలుర సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ మానస్‌ ధామ్నే శుభారంభం చేశాడు.

Update: 2023-07-10 10:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: Wimbledon 2023లో బాలుర సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ మానస్‌ ధామ్నే శుభారంభం చేశాడు. క్వాలిఫయర్‌ హోదాలో మెయిన్‌ ‘డ్రా’లో అడుగు పెట్టిన మానస్‌ ఆదివారం లండన్‌లో జరిగిన తొలి రౌండ్‌లో 6–2, 6–4తో ప్రపంచ జూనియర్‌ ర్యాంకింగ్స్‌లో 47వ స్థానంలో ఉన్న హేడెన్‌ జోన్స్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మానస్‌ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు 14 విన్నర్స్‌ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు.


Similar News