MS Dhoni: ఒకవేళ ధోనీ లెప్ట్‌ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తే ఇలా ఉంటుంది..! వీడియో వైరల్

సాధారణంగా ధోనీ రైట్ హ్యాండ్‌ బ్యాటర్‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే.

Update: 2023-09-09 14:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ధోనీ రైట్ హ్యాండ్‌ బ్యాటర్‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ధోనీ లెప్ట్‌ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూశారా ఎప్పుడైనా.. అతని ఫ్యాన్స్ పాత వీడియోలను ఎడిట్ చేసి  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో 2011 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో ధోనీ బ్యాటింగ్ చేసిన క్లిపింగ్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి మూడేళ్లు దాటిపోయింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌లో టీమ్‌ ఇండియా ఓటమిపాలైన తర్వాత ఆటకు దూరంగా ఉన్న ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. తాజాగా ధోనీకి సంబంధించిన ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.


Similar News