Ind Vs WI 3rd ODI : ఉత్కంఠగా మారిన మూడో వన్డే.. టాస్ గెలిచిన విండీస్..

ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో విండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

Update: 2023-08-01 13:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో విండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి వన్డేలో ‍కష్టపడి విజయం సాధించిన భారత్‌.. రెండో వన్డేలో మాత్రం ఘోర పరాజాయం పాలైంది. దీంతో ఈ ఆఖరి మ్యాచ్‌పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. గత రెండు వన్డేల్లో బ్యాటింగ్‌ విభాగంలో ప్రయోగాలు చేసిన భారత్ మిశ్రమ ఫలితాలను సాధించింది. ఇక రెండో వన్డేను చేజిక్కించుకున్న కరేబియన్ ​జట్టు.. అదే జోరుతో ఆఖరి పోరులోనూ విజయపథంలో నడవాలని ఆశిస్తోంది.

రెండో వన్డేలో ఓడిన తర్వాత కూడా టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయోగాలకే ప్రాధాన్యం ఇచ్చింది. మూడో వన్డేలో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే బరిలో దిగుతోంది భారత జట్టు. అయితే టీమిండియా ఈ మ్యాచ్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఉమ్రాన్‌ మాలిక్‌ స్థానంలో జైదేవ్‌ ఉనాద్కట్‌.. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ తుది జట్టులోకి వచ్చారు. ఇక విండీస్‌ మాత్రం సేమ్‌ జట్టుతోనే బరిలోకి దిగింది.

పిచ్‌ రిపోర్ట్‌..

బ్రియాన్ లారా స్టేడియంలోని పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. వికెట్‌ కొంచెం స్లోగా ఉంటుంది. కాబట్టి బ్యాటర్లు ఇబ్బంది పడే ఛాన్స్‌ ఉంది. ఇప్పటివరకు ఈ స్టేడియంలో ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ మైదానంలో పురుషల క్రికెట్‌లో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే. అయితే ఇప్పటివరకు మూడు మహిళలల వన్డే మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా 200 పరుగుల స్కోర్‌ నమోదు కాలేదు.

వరుణుడు కరుణించేనా..?

ఇక ఈ కీలక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ట్రినిడాడ్‌లో మ్యాచ్‌లో జరిగే సమయంలో ఓ మోస్తారు వర్షం​కురిసే అవకాశం ఉన్నట్లు ఆక్యూవెధర్‌ సంస్థ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఆక్యూవెధర్‌ ప్రకారం.. వర్షం పడటానికి 50 శాతం ఆస్కారం ఉంది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైనట్లైతే ఇరు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటాయి.

భారత్ (ప్లేయింగ్ XI):

ఇషాన్ కిషన్(w), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(c), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI):

బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్(w/c), షిమ్రాన్ హెట్మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్


Similar News