చివర్లో కుప్పకూలిన భారత్.. న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది.

Update: 2024-10-19 11:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌట్ అయిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో రెచ్చిపోయి ఆడింది. దీంతో భారీ స్కోరు దిశగా పయనమైంది. కానీ క్రీజులో ఉన్న సర్ఫరాజ్ ఖాన్, పంత్ వెంట వెంటనే అవుట్ అయ్యారు. దీంతో భారత బ్యాటర్లు వచ్చినవారు వచ్చినట్లే వెనక్కి వెళ్లారు. రోజు మొత్తం మంచిగా ఆడిన బ్యాటర్లు.. చివర్లో వికెట్లను సమర్పించుకొని పీకల్లోతు కష్టాల్లో పడ్డారు.

ఇదిలా ఉంటే భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 99.3 ఓవర్లకు 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా ఈ ఇన్నింగ్స్ లో జైశ్వాల్ 35, రోహిత్ శర్మ 52, కోహ్లీ 70, సర్ఫరాజ్ ఖాన్ 150, రిషబ్ పంత్ 99 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. అనంతర క్రీజులోకి వచ్చిన ప్లేయర్లు ఎవరు సరిగ్గా రాణించలేదు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లలో కలిపి 508 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ పై 106 పరుగులు లీడ్ లో ఉంది. అయితే ఈ మ్యాచులో న్యూజిలాండ్ జట్టు ముందు.. 107 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది.

మరీ ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే మిగిలిన ఒక్క రోజులో 107 పరుగులను కాపాడుకోవడమే కాకుండా.. న్యూజిలాండ్ జట్టును ఆలౌట్ చేయాల్సి ఉంది. మరీ ఈ ఒక్కరోజు ఆటలో ఎవరు.. తమ ఆధిపత్యాన్ని కొనసాగించి.. విజయం సాధిస్తారో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే మరి. 


Similar News