Ind Vs NZ: పటిష్ట స్థితిలో టీమిండియా.. బెంగళూరు టెస్ట్‌కు వర్షం అంతరాయం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో టీమిండియా ప్రత్యర్థి జట్టుకు ధీటుగా సమాధానం ఇస్తుంది.

Update: 2024-10-19 05:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో టీమిండియా ప్రత్యర్థి జట్టుకు ధీటుగా సమాధానం ఇస్తుంది. నాలుగో రోజు ఉదయం ఆట ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్లు సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ ధాటిగా ఆడతూ.. పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే సర్ఫరాజ్ ఖాన్‌ ఇంటర్‌నేషనల్ కెరీర్‌లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. కేవలం 110 బంతుల్లోనే ఎవరు ఊహించని విధంగా సునాయసంగా శతకం బాదేశాడు.

మరోవైపు రిషభ్ పంత్ కూడా వేగంగా ఆడుతూ.. తనదైన షాట్లతో కివీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటున్నాడు. అయితే, ఇద్దరు వేగంగా పరుగులు చేస్తున్న తరుణంలోనే వరుణుడు మరోసారి మ్యాచ్‌కు అడ్డు తగిలాడు. ప్రస్తుతం టీమిండియా 3 కీలక వికెట్లను కోల్పోయి 344 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ 154 బంతుల్లో 125, రిషభ్ పంత్ 56 బంతుల్లో 53 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఆట నిలిచే సమయానికి ఇంకా టీమిండియా, న్యూజిలాండ్ కన్నా 12 పరుగులు వెనుకబడే ఉంది.      


Similar News