కోహ్లీపై అభిమానం చాటుకున్న 15 ఏళ్ల కుర్రాడు.. 58 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న, పెద్ద అని తేడాలేకుండా విరాట్‌ను అభిమానించే వారు ఎందరో. మైదానంలోకి దూసుకొచ్చి తమ అభిమానాన్ని చాటుకున్న సందర్భాలు ఎన్నో. తాజాగా ఓ 15 ఏళ్ల కుర్రాడు కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. కోహ్లీని చూసేందుకు ఆ కుర్రాడు 58 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ కాన్పూర్ వచ్చాడు.
A 15-year-old kid rode 58 kilometers on his bicycle just to watch Virat Kohli bat pic.twitter.com/rigqQBoCHq
— A (@_shortarmjab_) September 27, 2024
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోకు చెందిన కార్తీకేయ 10వ తరగతి చదువుతున్నాడు. ఉన్నావో నుంచి కాన్పూర్‌కు 58 కి.మీ. దూరం. ఎలాగైనా కోహ్లీని చూడాలనుకున్న ఆ కుర్రాడు సైకిల్ తొక్కుకుంటూ కాన్పూర్ చేరుకున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరిన కార్తీకేయ ఉదయం 11 గంటలకు స్టేడియానికి చేరుకున్నాడు. అయితే, విరాట్ బ్యాటింగ్ చూడాలన్న ఆ కుర్రాడి కోరిక నెరవేరలేదు. టాస్ గెలిచిన రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అలాగే, వర్షం కారణంగా మ్యాచ్ కూడా తొలి రోజు త్వరగానే ముగిసింది. ఆ కుర్రాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.