అతడిని తిరిగి కెప్టెన్ చేస్తే బాగుంటుంది : మాజీ చీఫ్‌ సెలక్టర్‌

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి కెప్టెన్సీ చేపట్టే విషయంలో టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Update: 2023-07-10 11:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి కెప్టెన్సీ చేపట్టే విషయంలో టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరోసారి కెప్టెన్సీ చేపట్టే విషయంలో కోహ్లి ఆలోచనా ధోరణి ఎలా ఉందో నాకు తెలియదు. కానీ అజింక్య రహానే వైస్‌ కెప్టెన్‌గా పునరాగమనం చేసినపుడు మరి విరాట్‌ కోహ్లి ఎందుకు తిరిగి కెప్టెన్‌ కాకూడదు..? అని ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ అన్నాడు.

ఒకవేళ రోహిత్‌ తర్వాత కెప్టెన్‌ ఎవరన్న అంశంపై సెలక్టర్లు చర్చిస్తూ ఉంటే కచ్చితంగా విరాట్‌ రూపంలో వాళ్ల ముందు గొప్ప ఆప్షన్‌ ఉందని ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ అభిప్రాయపడ్డాడు. టెస్టు సారథిగా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కోహ్లిని తిరిగి కెప్టెన్‌ చేస్తే బాగుంటుందని.. కోహ్లి ఈ విషయం పట్ల సుముఖంగా లేకుంటే శుబ్‌మన్‌ గిల్‌ కూడా మంచి ఆప్షన్‌ అని పేర్కొన్నాడు. అయితే, ఈ యువ బ్యాటర్‌పై ఇప్పుడే భారం మోపడం సరికాదని అభిప్రాయపడ్డాడు.


Similar News