IND vs SL : శ్రీలంకపై Virat Kohli మెరుపు సెంచరీ.. Sachin Tendulkar ప్రపంచ రికార్డ్ బ్రేక్

భారత్, శ్రీలంకల మధ్య గౌహతిలోని బర్సపరా స్డేడియం వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగాడు.

Update: 2023-01-10 11:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్, శ్రీలంకల మధ్య గౌహతిలోని బర్సపరా స్డేడియం వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ కోహ్లీ 80 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ సెంచరీతో కోహ్లీ అంతర్జాతీయ వన్డేల్లో 45వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 257 ఇన్నింగ్స్‌లలో 45 వన్డే సెంచరీలు చేసిన కోహ్లీ టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు వన్డేల్లో అత్యంత వేగంగా 45 సెంచరీలు చేసిన రికార్డ్ సచిన్ పేరిట ఉండగా.. తాజాగా ఈ రికార్డ్‌ను కోహ్లీ బ్రేక్ చేశాడు.

అంతేకాకుండా భారత గడ్డపై 99 ఇన్నింగ్స్‌లలో 20 వన్డే సెంచరీలు చేసిన అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక, ఈ సెంచరీతో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 73 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ సెంచరీతో చేయడంతో అతడి అభిమానులు ఖుష్ అవుతున్నారు. ఇక, ఈ మ్యాచ్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ అదరగొట్టింది. ఓపెనర్లు శుభమన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ అదిరిపోయే శుభారంభం అందించారు. గిల్ 70, రోహిత్ శర్మ 83 పరుగులు చేసి చేశారు. యంగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కోహ్లీ, రోహిత్, గిల్ రాణించడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Tags:    

Similar News