ఏషియన్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు వినేశ్ ఫొగట్ అర్హత

భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఏషియన్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది.

Update: 2024-03-11 17:04 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఏషియన్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. పంజాబ్‌లోని పాటియాలాలో ఉన్న సాయ్ అకాడమీలో సోమవారం పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ టోర్నీ కోసం మహిళల సెలెక్షన్ ట్రయల్స్ జరిగాయి. ఇందులో వినేశ్ ఫొగట్ 50 కేజీల కేటగిరీలో ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు క్వాలిఫై అయ్యింది. ఫైనల్ బౌట్‌లో ఆమె 11-6 తేడాతో శివాని పవార్‌పై విజయం సాధించింది. మరోవైపు, 50 కేజీల కేటగిరీలోనూ పోటీపడిన వినేశ్ ఫొగట్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. సెమీస్‌లో 10-0 తేడాతో అంజు చేతిలో ఓడిపోయింది. ఆమెతోపాటు అన్షు మాలిక్(57 కేజీలు), మాన్సి అహ్లావత్(62 కేజీలు), నిషా దహియా(68 కేజీలు), రీతిక(76 కేజీలు) ఏషియన్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించారు. 

Tags:    

Similar News