కాస్ తీర్పుపై వినేష్ కన్నీటి పోస్టు

కాస్ తీర్పుపై వినేష్ హార్ట్ బ్రేకింగ్ పోస్టు పెట్టింది.

Update: 2024-08-15 17:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాస్ తీర్పుపై వినేష్ హార్ట్ బ్రేకింగ్ పోస్టు పెట్టింది. పారిస్ ఒలంపిక్స్ లో తనపై పడిన అనర్హతపై భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్భీట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్)ను ఆశ్రయించింది. అనేక విచారణల అనంతరం కాస్ వినేష్ అప్పీల్ ను తిరస్కరిస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. కాస్ తీర్పు అనంతరం వినేష్ తొలిసారిగా సోషల్ మీడియాలో ఓ కన్నీటి పోస్టు పెట్టింది. కాస్ తీర్పు ఎంతో వేదనకు గురిచేసిందనె అర్థం వచ్చేలా.. పారిస్ ఒలంపిక్స్ లో మ్యాట్ పై పడి కన్నీళ్ళు తుడుచుకుంటున్న ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. వినేష్ పోస్టుపై నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. నువ్వే మా అసలైన ఛాంపియన్, నువ్వే మా లెజెండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఒలంపిక్ లో అనర్హత వేటు పడిన తర్వాత ఇక రెజ్లింగ్ సెలవు అంటూ పోస్టు పెడుతూ.. రెజలింఫ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.  


Similar News